మోస్ట్ వాంటెడ్ రామన్నపై భారీ రివార్డ్ | Chhattisgarh police announces rewards on most wanted Maoists | Sakshi
Sakshi News home page

మోస్ట్ వాంటెడ్ రామన్నపై భారీ రివార్డ్

Apr 28 2017 10:09 PM | Updated on Oct 9 2018 2:53 PM

మోస్ట్ వాంటెడ్ రామన్నపై భారీ రివార్డ్ - Sakshi

మోస్ట్ వాంటెడ్ రామన్నపై భారీ రివార్డ్

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గత సోమవారం సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిని రాష్ట్ర పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది.

రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గత సోమవారం సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిని రాష్ట్ర పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల జాబితాను ఛత్తీస్‌గఢ్ పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. సుక్మా జిల్లాలో 25 మంది జవాన్ల మృతికి బాధ్యులైన మావోయిస్టుల ఫొటోలు విడుదల చేయడంతో పాటు వారి వివరాలను పోలీస్ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామన్న అలియాస్ రావుల నివాస్‌పై రూ. 40 లక్షల భారీ రివార్డును ప్రకటించారు. రావుల నివాస్ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మహిళా మావోయిస్టు వనజపై రూ. 8 లక్షల రివార్డును, కేరళపాల్ ఎల్‌జీఎస్ కమాండర్ రవి అలియాస్ రవీశన్నపై రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement