ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, సహాయక చర్యలపై చంద్రబాబు ఈ సందర్భంగా ప్రధానితో చర్చ జరిపారు. మోదీతో చంద్రబాబు భేటీని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ట్విట్ చేసింది. మోదీతో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో కూడా భేటీ అయ్యారు. ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలపై చర్చించారు. కాగా ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కరవు, సహాయక చర్యలపై ప్రధానితో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే.