సదానంద గౌడ: పబ్లిక్ ప్రాసిక్యూటర్ | Celebrations erupt as four from state inducted into cabinet | Sakshi
Sakshi News home page

సదానంద గౌడ: పబ్లిక్ ప్రాసిక్యూటర్

May 27 2014 3:37 AM | Updated on Sep 2 2017 7:53 AM

సదానంద గౌడ: పబ్లిక్ ప్రాసిక్యూటర్

సదానంద గౌడ: పబ్లిక్ ప్రాసిక్యూటర్

మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందిన కర్ణాటకకు చెందిన డీవీ సదానందగౌడ దక్షిణ కన్నడ జిల్లా సూల్యా తాలూకాలో 1953 మార్చి 19న జన్మించారు.

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందిన కర్ణాటకకు చెందిన డీవీ సదానందగౌడ దక్షిణ కన్నడ జిల్లా సూల్యా తాలూకాలో 1953 మార్చి 19న జన్మించారు. లా చదివిన ఆయన కొద్ది కాలం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. విద్యార్థి దశలో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం పుట్టూరు శాసనసభ స్థానం నుంచి 1994, 1999లలో 2 సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సదానందగౌడ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తొలిసారిగా దక్షిణ భారత దేశంలో బీజేపీ(కర్ణాటకలో) అధికారం చేపట్టింది.  
 
 రవిశంకర ప్రసాద్..
 మోడీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రవిశంకర ప్రసాద్(60) బీహార్‌కు చెందిన సీనియర్ రాజకీయ నేత. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదిగా మంచి పేరు గడించారు. 1954, ఆగస్ట్ 30న బీహార్‌లో ఉన్నతస్థాయి కులంలో జన్మించిన ప్రసాద్.. పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు.
 
  రాం విలాస్ పాశ్వాన్:
 రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దళిత నేత, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు 67 ఏళ్ల రాం విలాస్ పాశ్వాన్. ఎప్పటికప్పుడు పంథా మారుస్తూ సీజనల్ రాజకీయాలు చేయడంలో దిట్ట. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఎన్డీయే నుంచి వైదొలిగిన పాశ్వాన్ తిరిగి ఇదే గూటికి చేరి ఇప్పుడు కేబినెట్ మంత్రి పదవిని చేజిక్కించుకున్నారు.
 
 అనంతకుమార్:
 55 ఏళ్ల అనంతకుమార్ బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి సన్నిహితుడు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఎదిగిన వ్యక్తి, రాజకీయ నైపుణ్యం కలిగిన నాయకుడు. బెంగళూరు సౌత్ నుంచి ఆరోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. కర్ణాటకకు చెందిన అనంతకుమార్ 1959 జూలై 22న ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.మైసూర్ వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు.
 
 గోపీనాథ్ ముండే:
 మహారాష్ట్రకు చెందిన ఓబీసీ నేత. ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడం ఇదే తొలిసారి. 15వ లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేతగా ఉన్నారు. బీడ్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ముండేను ఓడించేందుకు ఎన్‌సీపీ చీఫ్ శరద్‌పవార్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలించలేదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముండే ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తారు.
 
 కల్‌రాజ్ మిశ్రా: జేపీ సహచరుడు

 జయప్రకాశ్ నారాయణ్ సహచరుడు, సంఘ్ ప్రచారక్ అరుున కల్‌రాజ్ మిశ్రా ఉత్తరప్రదేశ్ రాజకీయూల్లో కురువృద్ధుడు. నాటి జన్ సంఘ్‌తో  సహవాసం ఆయన రాజకీయ జీవితానికి పునాదులు వేసింది. జేపీ ప్రారంభించిన ‘సంపూర్ణ క్రాంతి’ (టోటల్ రివల్యూషన్) ఉద్యమంలో కన్వీనర్‌గా పని చేశారు. మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యూరు. మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. 1941లో యూపీలోని ఘాజీపూర్‌లో జన్మించారు.
 
 వి.కె.సింగ్: మాజీ సైనికాధిపతి
 రాజకీయూలకు కొత్త అరుున వి.కె.సింగ్ ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నారు. మాజీ సైనికాధిపతి అరుున 63 ఏళ్ల సింగ్ తన వయస్సుకు సంబంధించిన వివాదంపై యూపీఏ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటమే చేశారు. చివరకు న్యాయ పోరాటంలోనూ ఓడిపోయూరు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 5.67 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి మోడీ తర్వాతి స్థానంలో నిలిచారు. మంత్రివర్గంలో చోటు సంపాదించారు. 1951 మే 10న పూనాలోని మిలటరీ ఆస్పత్రిలో జన్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement