ఒక వైద్య పట్టభద్రుడు తన ఇంటి పేరు మార్చుకున్నందుకు ఇప్పుడు అతను పోస్టు గ్రాడ్యుయేట్‌లో చేరే అవకాశాన్ని కోల్పోయాడు.
ముంబై: ఒక వైద్య పట్టభద్రుడు తన ఇంటి పేరు మార్చుకున్నందుకు ఇప్పుడు అతను పోస్టు గ్రాడ్యుయేట్‌లో చేరే అవకాశాన్ని కోల్పోయాడు. దీన్ని సవాలు చేస్తూ అతను బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇంటిపేరు మార్చుకున్నంత మాత్రాన అతని కులం ఏమీ మారదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అతనికి మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ సీటు వచ్చే అవకాశం ఏర్పడింది.
పిటిషనర్ శాంతను హరి భరద్వాజ్ తన ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేశాడు. తర్వాత రిజర్వుడ్ కోటా కింద ఎస్టీ విభాగంలో మెడికల్ పీజీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అతని కుల ధ్రువీకరణ పత్రంలో ఇంటిపేరు వేరుగా ఉండడంతో సీటును నిరాకరించారు.