అఫ్జల్‌ గురు టెన్షన్‌.. కశ్మీర్‌లో కట్టడి | Afzal Guru death anniversary:Restrictions in Srinagar, Shopian | Sakshi
Sakshi News home page

అఫ్జల్‌ గురు టెన్షన్‌.. కశ్మీర్‌లో కట్టడి

Feb 9 2017 1:51 PM | Updated on Mar 28 2019 6:19 PM

అఫ్జల్‌ గురు టెన్షన్‌.. కశ్మీర్‌లో కట్టడి - Sakshi

అఫ్జల్‌ గురు టెన్షన్‌.. కశ్మీర్‌లో కట్టడి

చాలాకాలం తర్వాత కశ్మీర్‌లో పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించి పరిమితులు విధించారు.

శ్రీనగర్‌: చాలాకాలం తర్వాత కశ్మీర్‌లో పోలీసులు పకడ్బందీ చర్యలు ప్రారంభించి పరిమితులు విధించారు. పార్లమెంటుపై దాడికి కారణమైన అఫ్జల్‌ గురు చనిపోయిన రోజు కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శ్రీనగర్‌, షోపియాన్‌ తదితర ప్రాంతంలో గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చేసే చర్యల్లో భాగంగానే తాము ఈ పనిచేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మరోపక్క.. సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే బలగాలను మోహరించి మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని పెట్రోల్‌ బంక్‌లు, దుకాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఈ సందర్భంగా మూసి ఉంచారు. భారత పార్లమెంటుపై దాడికి పాల్పడిన అఫ్జల్‌ గురును ఢిల్లీలోని తిహార్‌ జైలులో 2013 ఫిబ్రవరి 9న ఉరితీసి అక్కడే పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement