ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం | 7 year old girl gang raped in uttar pradesh | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Jun 23 2014 9:54 AM | Updated on Sep 2 2017 9:16 AM

ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఏడేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.

ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఏడేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. పొలాల్లో ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి వచ్చి ఎత్తుకెళ్లాడని, అతడితో పాటు మరో ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. ఉదయం 8-9 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని, బాలిక పరిస్థితి విషమంగా ఉందని ఆమె మేనమామ చెప్పారు.

బాలిక పొలాల్లో ఒంటరిగా పడి ఉండగా స్థానికులు గమనించి ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు విషయం చెప్పినా.. వారు వెంటనే స్పందించాల్సింది పోయి, పది గంటల తర్వాత మాత్రమే ఆమెను ఆస్పత్రిలో చేర్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమె జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement