గాల్లో యాక్షన్‌

vishal new movie action look release - Sakshi

తనపై ఎటాక్‌ చేసినవారికి తనదైన శైలిలో జవాబు చెబుతున్నారు విశాల్‌. ఇందుకోసం కత్తులు, తుపాకులతో యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. విశాల్‌ హీరోగా సుందర్‌. సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు ‘యాక్షన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో విశాల్‌ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ కోసం విశాల్‌ అండ్‌ టీమ్‌ టర్కీ, అజర్‌బైజాన్‌కు వెళ్లొచ్చారు.

టర్కీ షూటింగ్‌ సమయంలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌లో భాగంగా విశాల్‌ గాయపడిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత మళ్లీ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు విశాల్‌. ఇందులో తమన్నా, ఐశ్వర్యా లక్ష్మీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... విశాల్‌–సుందర్‌. సి కాంబినేషన్లో ఇంతకుముందు ‘అంబల, మదగజరాజా’ అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top