సినిమా తరువాతే వివాహం | trisha krishnan Cinema After Marriage | Sakshi
Sakshi News home page

సినిమా తరువాతే వివాహం

Mar 17 2014 1:20 AM | Updated on Aug 13 2018 4:19 PM

సినిమా తరువాతే వివాహం - Sakshi

సినిమా తరువాతే వివాహం

ముందు సినిమా తరువాతే పెళ్లి అంటున్నారు చిరునవ్వుల చిన్నది నటి త్రిష. ఈమెలో ప్రత్యేకత ఏమిటంటే సినిమాకు పరిచయం అయినప్పడు నవనవలాడుతూ ఎంత అందంగా

ముందు సినిమా తరువాతే పెళ్లి అంటున్నారు చిరునవ్వుల చిన్నది నటి త్రిష. ఈమెలో ప్రత్యేకత ఏమిటంటే సినిమాకు పరిచయం అయినప్పడు నవనవలాడుతూ ఎంత అందంగా ఉన్నారో నేటికీ మాయని అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. నటిగా దశాబ్ద కాలం దాటినా నేటికీ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిల పరచుకుంటున్నారు. తమిళం, తెలుగు, హిందీ అంటూ ఒక రౌండ్ కొట్టొచ్చిన త్రిష తాజాగా కన్నడ సినిమాకు పరిచయం అవ్వ డం ఆమె క్రేజ్‌కు నిదర్శనం. కన్నడంలో పునిత్ రాజ్‌కుమార్ సరసన నటిస్తున్న ఈ సుందరి ఆ చిత్ర షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారు. త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబుకు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు.
 
 ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే తెలుగు చిత్రంలో నటించారు. అదే విధంగా శింబు సరసన ఇప్పటికే విన్నై తాండి వరువాయో చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజమే. పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ నిర్మించనున్న ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ తన అభిమాన దర్శకుల్లో సెల్వరాఘవన్ ఒకరన్నారు. అలాంటి దర్శకుడితో మరోసారి కలసి పని చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సెల్వరాఘవన్ నెల క్రితం ఈ చిత్ర కథ చెప్పారన్నారు. కథ చాలా నాలెడ్జీగా ఉందనిపించిందని అన్నారు. దశాబ్దం దాటినా హీరోయిన్‌గా వరుస అవకాశాలు వరిస్తున్నాయి. మరి పెళ్లి సంగతేమిటన్న  ప్రశ్నకు తనకు సినిమానే ఫస్ట్ అని మ్యారేజ్ తరువాత అని త్రిష పేర్కొనడం విశేషం. 
 

Advertisement
 
Advertisement
Advertisement