శిరీష్‌లాంటి బాయ్‌ఫ్రెండ్‌ లావణ్య లాంటి గాళ్ ఫ్రెండ్‌ని కోరుకుంటారు! | Srirastu Subhamastu theatrical trailer | Sakshi
Sakshi News home page

శిరీష్‌లాంటి బాయ్‌ఫ్రెండ్‌ లావణ్య లాంటి గాళ్ ఫ్రెండ్‌ని కోరుకుంటారు!

Jul 26 2016 11:03 PM | Updated on Sep 4 2017 6:24 AM

శిరీష్‌లాంటి బాయ్‌ఫ్రెండ్‌ లావణ్య లాంటి గాళ్ ఫ్రెండ్‌ని కోరుకుంటారు!

శిరీష్‌లాంటి బాయ్‌ఫ్రెండ్‌ లావణ్య లాంటి గాళ్ ఫ్రెండ్‌ని కోరుకుంటారు!

‘‘పరశురామ్‌లో మంచి దర్శకుడే కాదు, రచయిత కూడా ఉన్నాడు. ‘వేదం’తో అల్లు అర్జున్ అనే వ్యక్తి నన్ను ముందుకు తీసుకువెళ్లాడు.

‘‘పరశురామ్‌లో మంచి దర్శకుడే కాదు, రచయిత కూడా ఉన్నాడు. ‘వేదం’తో అల్లు అర్జున్ అనే వ్యక్తి నన్ను ముందుకు తీసుకువెళ్లాడు. బాలకృష్ణ గారి వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చేసే అవకాశం నాకు ఇవ్వడం మరింత ముందుకు తీసుకువెళ్లడమే. అలా.. అల్లు శిరీష్‌తో చేసిన ఈ ‘శ్రీరస్తు శుభమస్తు’ పరశురామ్‌కి కొత్త సినిమా అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు క్రిష్. అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా పరశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’.
 
 ఆగస్టు 5న సినిమాని విడుదల చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో క్రిష్ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ‘‘ప్రేమ తప్పకుండా జయిస్తుంది. పరశురామ్‌లో కావల్సినంత ప్రేమ ఉంది. శిరీష్, లావణ్య జంట చూడముచ్చటగా ఉంది. ఈ కథ నాకు తెలుసు. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేక్షకులు ఏమాత్రం డిజప్పాయింట్ కారు. పరశురామ్ అంత బాగా తెరకెక్కించాడు.
 
 ఈ నెల 31న నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై శిరీష్‌ను ఆశీర్వదిస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూసిన ప్రతి అబ్బాయి లావణ్య వంటి గాళ్ ఫ్రెండ్ కావాలని, ప్రతి అమ్మాయి శిరీష్ వంటి బాయ్ ఫ్రెండ్ కావాలని అనుకుంటారు’’ అన్నారు పరశురామ్. ఈ కార్యక్రమంలో అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి పాల్గొన్నారు. ప్రకాశ్ రాజ్, సుమలత, సుబ్బరాజ్, ప్రగతి, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ సినిమాకి కెమేరా: మణికంఠన్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగరాజు, మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement