విజయ్‌తో అతిలోక సుందరి | Sridevi in Vijay's next fantasy film? | Sakshi
Sakshi News home page

విజయ్‌తో అతిలోక సుందరి

Apr 18 2014 12:10 AM | Updated on Sep 2 2017 6:09 AM

విజయ్‌తో అతిలోక సుందరి

విజయ్‌తో అతిలోక సుందరి

ఇళయదళపతి విజయ్ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి ముఖ్యపాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. నటి శ్రీదేవి కోలీవుడ్‌లో బాలనటి నుంచి క్రేజీ హీరోయిన్‌గా ఎదిగిన

ఇళయదళపతి విజయ్ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి ముఖ్యపాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. నటి శ్రీదేవి కోలీవుడ్‌లో బాలనటి నుంచి క్రేజీ హీరోయిన్‌గా ఎదిగిన తరువాత సూపర్‌స్టార్ రజనీకాంత్, పద్మశ్రీ కమలహాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు. తెలుగు, హిందీ చిత్రాలకు టాప్ హీరోయిన్‌గా ప్రకాశించిన శ్రీదేవి బోనీకపూర్‌ను వివాహమాడిన తరువాత నటనకు దూరం అయ్యారు. అలాంటిది సుదీర్ఘ విరామం తరువాత ఈ మధ్యనే ఇంగ్లీష్ వింగ్లీష్ ద్వారా మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. ఈ చిత్రం హిందీలో రూపొందినా దక్షిణాదిలోనూ అనువాదమై విజయం సాధించింది. దీంతో శ్రీదేవిని నటింప చేయడానికి పలువురు దర్శక, నిర్మాతలు  ప్రయత్నిస్తూనే ఉన్నారు.
 
 తాజాగా విజయ్ చిత్రంలో ఈ అతిలోక సుందరిని నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విజయ్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి విజయ్ శింబుదేవన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని పిటి సెల్వకుమార్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన నటి శ్రుతిహాసన్ ను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శ్రీదేవి నటించనున్నారా? అన్న ప్రశ్నకు చిత్ర నిర్మాత పి.టి.సెల్వకుమార్ బదులిస్తూ శ్రీదేవితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అయినా ఇప్పుడే ఈ చిత్రం గురించి మాట్లాడడం అప్రస్తుతమని, ఇంకా చాలా సమయం ఉందని ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement