వీగన్లు.. సోనమ్‌ సలహా తప్పక పాటించండి!

Sonam Kapoor Warning To Vegetarians And Vegans - Sakshi

‘వెజిటేరియన్లు, వీగన్లకు ఒక చిన్న విన్నపం! మీరు తీసుకునే ఉప్పులో అయోడిన్ పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. నాకు అయోడిన్‌ లోపం ఉన్నట్లుగా ఇప్పుడే తెలిసింది. టేబుల్‌ సాల్ట్‌ తీసుకోవడం ద్వారా దీనిని అధిగమించవచ్చు. థ్యాంక్యూ! లవ్‌ యూ ఆల్‌’ అంటూ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ దివా సోనమ్‌ కపూర్ తాను అయోడిన్‌ లోపంతో బాధపడుతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. వీగన్లుగా ఉన్న వారు తప్పక తన సలహా పాటించాలని సూచించారు. జంతు ప్రేమికురాలైన సోనమ్ వీగన్‌ డైట్‌ ఫాలో అవుతారన్న సంగతి తెలిసిందే. కాగా జంతువుల నుంచి వచ్చే ఏ పదార్థాన్ని వాడకపోవడమే వీగనిజం. వీగన్లు పాల పదార్థాలు తీసుకోరు. అదే విధంగా ఉన్ని, లెదర్‌ దుస్తులు వాడరు. మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుని జీవిస్తారు.

ఇక ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి దాకా సోనమ్‌ అందం ఏమాత్రం చెక్కుచెదరకపోవడానికి ఆమె పాటించే ఆహారపుటలవాట్లు కూడా ఒక కారణమని సోనమ్‌ సన్నిహితులు చెబుతున్నారు. కాగా సోనమ్ ప్రస్తుతం ‘ది జోయా ఫాక్టర్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. అనుజా చౌహాన్‌ రచించిన నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జోయా సోలంకి అనే రాజ్‌పూత్‌ అమ్మాయిగా ఆమె కనిపించనున్నారు. అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక ఈ సినిమాలో సౌత్‌ యువ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top