
అప్పటికప్పుడు కవిత రాసేశాను!
తొలి చూపులోనే ఆకట్టుకునే అందం కృతీ సనన్ సొంతం. ‘1’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో ‘హీరో పంతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.
తొలి చూపులోనే ఆకట్టుకునే అందం కృతీ సనన్ సొంతం. ‘1’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో ‘హీరో పంతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో తను చేస్తున్న తొలి చిత్రం ఇది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శక, నిర్మాతల దృష్టి కృతిపై పడింది. భవిష్యత్ చాలా ఆశాజనకంగా ఉందంటున్నారామె.
నటన మాత్రమే కాదు.. కృతికి ఇతర ప్రతిభలు కూడా ఉన్నాయి. స్కూల్, కాలేజ్ డేస్‌లో బాగా డాన్స్ చేసేవారట. అలాగే కవితలు కూడా రాసే అలవాటు ఉండేదట. దాని గురించి కృతి చెబుతూ - ‘‘నాకు కవితలు రాయడం చాలా ఇష్టం. సినిమాల్లోకి రాకముందు తెగ రాసేదాన్ని. కానీ, ఇక్కడికొచ్చిన తర్వాత తీరిక చిక్కడంలేదు. మా తాత చనిపోయినప్పుడు ఓ కవిత రాశాను. అల్లారు ముద్దుగా చూసుకున్న తాత ఇక లేరనే బాధలోంచి ఆశువుగా పుట్టుకొచ్చిన కవిత అది. నేను రాసిన చివరి కవిత అదే. హీరోయిన్ అయిన తర్వాత ఏ కాస్త టైమ్ చిక్కినా సినిమాలు చూస్తున్నాను. అలాగే ఢిల్లీలో మా ఇంటికెళ్లి, కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను. అందుకే కవితలు రాయడానికి టైమ్ ఉండటంలేదు’’ అన్నారు