బయోపిక్‌పై క్లారిటీ.. వచ్చే నెలలో సెట్స్‌ పైకి!

Shraddha Kapoor Says Saina Nehwal Biopic Starts Soon - Sakshi

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అది కూడా ఒకేసారి వివిధ భాషల్లో, వివిధ జానర్‌ చిత్రాలు చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ప్రభాస్‌ సాహో సినిమాతో పాటు బాలీవుడ్‌లోనూ విభిన్న చిత్రాల్లో నటిస్తున్నారు శ్రద్ధా. ఇప్పటికే స్త్రీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ, బట్టి గుల్‌ మీటర్‌ చల్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇలా డిఫరెంట్‌ జానర్స్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తూనే మరో చాలెంజింగ్‌ రోల్‌కు రెడీ అవుతున్నారు. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు శ్రద్ధా. ప్రస్తుతం ఈ సినిమా కోసం అథ్లెటిక్‌ ఫిట్‌నెస్‌ కోసం కష్టపడుతున్నారు. వచ్చే నెలలో ఈ బయోపిక్‌ షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top