శింబుకు బాసటగా నిలిచిన హన్సిక | Shimbu achieve success, says hansika | Sakshi
Sakshi News home page

శింబుకు బాసటగా నిలిచిన హన్సిక

Jul 11 2015 8:49 AM | Updated on Sep 3 2017 5:15 AM

శింబుకు బాసటగా నిలిచిన హన్సిక

శింబుకు బాసటగా నిలిచిన హన్సిక

ఒక పక్క శింబుపై కుట్ర జరుగుతోంది. తన చిత్రాలను విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారు అంటూ ఆయన తండ్రి సీనియర్ నట,దర్శక నిర్మాత టి.రాజేంద్రన్ ఆవేదన వ్యక్తం చేస్తుంటే ...

ఒక పక్క శింబుపై కుట్ర జరుగుతోంది. తన చిత్రాలను విడుదల కాకుండా సమస్యలు సృష్టిస్తున్నారు అంటూ ఆయన తండ్రి సీనియర్ నట,దర్శక నిర్మాత టి.రాజేంద్రన్ ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరో పక్క ఒకే ఒక్క వ్యక్తి శింబు జయించాలని కోరుకుంటే బహిరంగంగా ఈ విషయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఆ వ్యక్తి ఎవరబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? ఎవరో అయితే న్యూస్ ఏముంది. అలా కోరుకుంటోంది నటుడు శింబు మాజీ ప్రియురాలు హన్సిక. శింబు,హన్సిక జంటగా నటించిన చిత్రం వాలు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి మధ్య లవ్ మొదలై బ్రేక్‌అప్ అయ్యింది.

చిత్ర నిర్మాణం పలు సమస్యలతో సుదీర్ఘ కాలం సాగింది.ఇంకా ఒక్క సాంగ్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటంతో నిర్మాత కష్టాలకు,మాజీ ప్రియుడి బాధకు కరిగిపోయి,జాలి కలిగి మళ్లీ పాట చిత్రీకరణకు కాల్‌షీట్స్ ఇచ్చారని కోలీవుడ్ వర్గాల టాక్. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్ర యూనిట్ తో శింబు సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను హన్సిక వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే గనుక నిజం అయితే ఆమె వ్యాఖ్యలు శింబుకు చాలా ఉపశమనాన్ని కలిగించినట్లే. ఇదంతా బాగానే ఉంది. శింబు వాలు చిత్ర ప్రచారాన్ని మొదలెట్టారు. ఆ ప్రచారంలో ఈ మాజీ ప్రియురాలు పాలు పంచుకుంటారా? అన్నదే ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement