ఆ రీమేక్‌కు క్లాప్‌ కొట్టారు

Sharwanand And Samantha Movie Started - Sakshi

తమిళనాట క్లాసిక్‌ హిట్‌గా నిలిచిన 96 సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ మూవీ అక్కడ ఓ కల్ట్‌గా మిగిలిపోయింది. అంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమాతో.. త్రిష మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది.

తెలుగులో ఈ సినిమాను శర్వానంద్‌, సమంత హీరోహీరోయిన్లుగా.. తమిళ దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌ తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఇక్కడి ప్రేక్షకుల రుచికి తగ్గట్టు గత కొన్నిరోజులుగా ఈ చిత్రానికి మార్పులు చేర్పులు చేస్తుండగా.. ఎట్టకేలకు క్లాప్‌ కొట్టేశారు. ఉగాది సందర్భంగా ఈ మూవీని ప్రారంభించింది చిత్రయూనిట్‌. ఈ కార్యక్రమానికి ఇంద్రగంటి మోహనకృష్ణ, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. సమంత మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ నెల చివరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగుతుందని నిర్మాత ప్రకటించారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top