స్క్రీన్‌ టెస్ట్‌ శ్రీదేవి స్పెషల్‌ క్విజ్ | Sakshi
Sakshi News home page

Special Quiz on Sridevi: తెలుగులో ఆ హీరోతో ఎక్కువ సినిమాలు.. శ్రీదేవి ముద్దు పేరేంటో తెలుసా?

Published Fri, Mar 2 2018 12:21 AM

Screen Test Sridevi Movies Special - Sakshi

► ‘సిరిమల్లె పువ్వా...’ అంటూ శ్రీదేవి సందడి చేసిన ‘పదహారేళ్ల వయసు’ సినిమా దర్శకుడెవరు?
ఎ) బాలచందర్‌ బి) కె. రాఘవేంద్రరావు సి) కె.విశ్వనాథ్‌ డి) భారతీరాజా

► మా ‘బంగారక్క’ సినిమాలో శ్రీదేవి సరసన నటించిన హీరో ఎవరు?
ఎ) చంద్రమోహన్‌ బి) మురళీమోహన్‌ సి) మోహన్‌బాబు డి) శోభన్‌బాబు
 

► శ్రీదేవి  కనిపించబోతున్న చివరి సినిమా?
ఎ) దబాంగ్‌ 3  బి) థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌  సి) గోల్డ్‌ డి) జీరో

► బాలీవుడ్‌లో  ఏ హీరోతో శ్రీదేవి ఎక్కువ సినిమాల్లో నటించారో తెలుసా?
ఎ) మిథున్‌ చక్రవర్తి బి) జితేంద్ర సి) రిషీ కపూర్‌ డి) అమితాబ్‌ బచ్చన్‌

► శ్రీదేవి ఒకప్పటి స్టార్‌ కమెడియన్‌ సరసన  హీరోయిన్‌గా నటించారు. ఎవరా హాస్యనటుడు?
ఎ) రేలంగి  బి) రాజబాబు సి) రమణారెడ్డి డి) పద్మనాభం

► ‘మామ్‌’  శ్రీదేవికి 300వ  చిత్రం.  ఆ చిత్రానికి సంగీత దర్శకుడెవరు?
ఎ) విశాల్‌ శేఖర్‌ బి) ఏ.ఆర్‌. రెహమాన్‌  సి) ఇళయరాజా డి) దేవిశ్రీ ప్రసాద్‌

► శ్రీదేవి ముద్దు పేరేంటో తెలుసా?  
ఎ) మున్నీ   బి) చిన్ని   సి) బుజ్జి   డి) పప్పీ

► శ్రీదేవి నటించిన ‘మిస్టర్‌  ఇండియా’కు నిర్మాత ఎవరు?
ఎ) యశ్‌ రాజ్‌  బి) బోనీ కపూర్‌  సి) యశ్‌ జోహార్‌ డి) సాజిద్‌ నడియాడ్‌వాలా

► శ్రీదేవితో 24 సినిమాలు చేశాను. తను ఒప్పుకుంటే 25వ సినిమా కూడా తీస్తానని ఇటీవల ప్రకటించిన టాలీవుడ్‌ దర్శకుడెవరు?
ఎ) కె.బాపయ్య    బి) కె.రాఘవేంద్రరావు  సి) కె.యస్‌.ఆర్‌. దాస్‌    డి) కె.చంద్రశేఖర్‌ రెడ్డి

► ‘2002 వరకు చూడలేదే ఇంత సరుకు..’ అంటూ చిన్న యన్టీఆర్, ఆర్తీ అగర్వాల్‌ స్టెప్పులేసిన సాంగ్‌ పెద్ద యన్టీఆర్, శ్రీదేవి నటించిన ఓ సూపర్‌హిట్‌ సాంగ్‌కు రీమిక్స్‌. అది ఏ పాటో కనుక్కోండి?
ఎ) ఆకుచాటు పిందె తడిచే  బి) ఇది ఒకటో నంబర్‌ బస్సు  సి) జాబిలితో చెప్పనా  డి) తెల్లా తెల్లని చీరలోని చందమామ

► ‘బాబు’ అనే తమిళ  సినిమాలో ఈ నలుగురి  నటుల్లో ఒక నటుడికి శ్రీదేవి  కూతురిగా నటించింది.  ఆ నటుడెవరు?
ఎ) రజనీకాంత్‌  బి) చారుహాసన్‌  సి) కమల్‌హాసన్‌ డి) శివాజీగణేశన్‌

► తెలుగులో శ్రీదేవితో 31 సినిమాల్లో కలిసి నటించిన హీరో ఎవరో తెలుసా?
ఎ) కృష్ణ  బి) కృష్ణంరాజు సి) యన్టీఆర్‌  డి) అక్కినేని నాగేశ్వరరావు

► బాలీవుడ్‌లో శ్రీదేవి ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా?
ఎ) 5   బి) 4   సి) 11   డి) 7

► తెలుగు ‘పదహారేళ్ల వయసు’ తమిళ మాతృక ‘పదినారు వయదినిలే’కి శ్రీదేవి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? (ఇందులో నటించిన రజనీకాంత్‌ పారితోషికం కంటే ఆమెకు 6 వేల రూపాయలు ఎక్కువ)
ఎ) 25,000 బి) 15,000 సి) 12,000 డి) 9,000

► శ్రీదేవి బాల నటిగా  తెరంగేట్రం చేసినప్పుడు  ఆమె వయసెంత?
ఎ) 3 బి) 2 సి) 6 డి) 4

► సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసేలోపు ఫస్ట్‌ ఇన్నింగ్స్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టిన మధ్యలో శ్రీదేవి కనిపించిన టీవీ షో పేరేంటి?
ఎ) బిగ్‌ బాస్‌  బి) కౌన్‌ బనేగా కరోడ్‌పతి సి)  మాలినీ అయ్యర్‌ డి) దస్‌ కా దమ్‌

► శ్రీదేవి నటిగానే మనకు తెలుసు కానీ మనకు తెలియని  ఒక అద్భుతమైన టాలెంట్‌ ఆమెలో దాగి ఉంది. అదేంటో మీకు తెలుసా?
ఎ) సింగింగ్‌ బి) రైటింగ్‌ సి) పెయింటింగ్‌ డి) టెన్నిస్‌ ప్లేయర్‌

► శ్రీదేవి హిందీ పరిశ్రమకి వెళ్లిన కొత్తలో ఆమె చేసిన పాత్రకు ఫేమస్‌ హీరోయిన్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఎవరా హీరోయిన్‌?
ఎ) హేమ మాలినీ బి) రేఖ  సి) జయాబచ్చన్‌  డి) మీనాక్షి శేషాద్రి
 

► ఎన్టీఆర్‌ మనవరాలిగా శ్రీదేవి నటించిన ఈ స్టిల్‌  ఏ చిత్రంలోనిది?
ఎ) తునైవన్‌  బి) బడిపంతులు  సి) నా తమ్ముడు డి) బాబు

► శ్రీదేవి నటించిన సూపర్‌హిట్‌ సినిమాలోని స్టిల్‌ ఇది. ఈ సినిమా పేరేంటి?
ఎ) ఆఖరి పోరాటం  బి) క్షణ క్షణం సి) గోవిందా గోవిందా డి) జగదేక వీరుడు – అతిలోక సుందరి

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) బి 2) బి 3) డి 4) ఎ 5) బి 6) బి 7) డి 8) బి 9) బి 10) ఎ

11) డి 12) ఎ 13) డి14) డి 15) డి 16) సి 17) సి 18) బి  19) బి20) (డి)

Advertisement

తప్పక చదవండి

Advertisement