అతన్నే పెళ్లి చేసుకుంటా! | Samantha to marry a young Tollywood hero? | Sakshi
Sakshi News home page

అతన్నే పెళ్లి చేసుకుంటా!

Jun 12 2016 3:53 AM | Updated on Apr 3 2019 9:14 PM

అతన్నే పెళ్లి చేసుకుంటా! - Sakshi

అతన్నే పెళ్లి చేసుకుంటా!

మనసులో మాటను అరకొరగా బయట పెడితే లేనిపోని తలనొప్పి కొని తెచ్చుకున్నట్లే....

మనసులో మాటను అరకొరగా బయట పెడితే లేనిపోని తలనొప్పి కొని తెచ్చుకున్నట్లే. నటి సమంత ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కెరీర్ పరంగా ఈ చెన్నై చిన్నది వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు. తమిళంలో తెరి, 24 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అలాగే తెలుగులో నటించిన తాజా చిత్రం అఆ మంచి ప్రజాదరణతో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ అభిమానుల ఆదరణలో తనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయన్నారు. దీంతో విశ్రాంతి లేకుండా నటించుకుపోతున్నానని అన్నారు.

వేసవిలో కూడా విరామం లేకుండా చిత్రం తరువాత చిత్రం అంటూ వరుసగా నటిస్తున్నట్లు చెప్పారు. తమిళంలో తెరి, 24 చిత్రాల్లో తన నటనకు మంచి పేరు వచ్చిందన్నారు. అయితే వరుసగా ప్రేమ కథా చిత్రాల్లో నటించడం బోర్ కొడుతోందని అన్నారు. అలాంటి చిత్రాలు చూసే తన అభిమానులకు అలాంటి ఫీలింగే కలుగుతుందని అన్నారు. అందుకే నటనకు అవకాశం ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అదే విధంగా హారర్ కథా చిత్రాల్లో నటించాలనే ఆసక్తి కలుగుతోందని చెప్పారు. కన్నడంలో కథానాయకడులేని చిత్రంలో నటించే అవకాశం రావడంతో వెంటనే అంగీకరించినట్లు తెలిపారు. ఇకపోతే తాను హైదరాబాద్ షూటింగ్‌లకు వస్తే హోటల్‌లో బస చేయాల్సివస్తోందన్నారు.అందుకే అక్కడ ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నట్లు, అందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా సామాజిక సేవ అన్నది తన శ్వాస లాంటిదన్నారు. ఆత్మ సంతృప్తి కోసమే సామాజిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అందుకు నిధిని సమకూర్చడం కోసం త్వరలో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చివరిగా ఒక విషయం చెప్పాలన్నారు. తాను ఒక వ్యక్తిని ప్రేమించానని చెప్పానని, దీంతో తను ఎవరన్నది చెప్పాలంటూ మీడియా వాళ్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారన్నారు. ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియా రచ్చరచ్చ చేస్తున్నట్లు వాపోయారు. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఆ సమయం వచ్చినప్పుడు తాను ప్రేమించిన వ్యక్తి ఎవరన్నది చెబుతానని, ఆయన్నే పెళ్లి చేసుకుంటానని సమంత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement