గాయపడిన చరణ్‌.. ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు బ్రేక్‌ | RRR Shooting Postponed due To Ram Charan Ankle Injury | Sakshi
Sakshi News home page

గాయపడిన చరణ్‌.. ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు బ్రేక్‌

Apr 3 2019 4:56 PM | Updated on Jul 14 2019 4:05 PM

RRR Shooting Postponed due To Ram Charan Ankle Injury - Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణేలో జరుగుతోంది. అయితే జిమ్‌లో కసరత్తులు చేస్తున్న రామ్‌చరణ్‌ గాయపడటంతో షూటింగ్ వాయిదా పడింది. చరణ్‌ గాయం కారణంగా షూటింగ్ వాయిదా వేస్తున్నట్టుగా తెలిపిన చిత్రయూనిట్ మూడు వారాల తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియజేశారు.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను 2020 జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement