తిరుపతిలో ‘రౌడీ’ హంగామా
మోహన్‌బాబు-రామ్‌గోపాల్‌వర్మ... నిజంగా ఊహించని కాంబినేషనే. ఒక్కసారిగా ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నామని చెప్పి.. అటు పరిశ్రమకు, ఇటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు.
మోహన్‌బాబు-రామ్‌గోపాల్‌వర్మ... నిజంగా ఊహించని కాంబినేషనే. ఒక్కసారిగా ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నామని చెప్పి.. అటు పరిశ్రమకు, ఇటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. మోహన్‌బాబు గొప్ప నటుడు. వర్మ గొప్ప దర్శకుడు. వీరి కలయికలో సినిమా అనగానే.. అందరిలోనూ ఆసక్తి పెరిగింది. సినిమాకు రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకోవడం, పైగా సినిమాకు ‘రౌడీ’ అని టైటిల్ పెట్టడం, మోహన్ బాబు ఏకంగా విగ్ లేకుండా నిజజీవిత గెటప్‌లో నటించడం, విష్ణు కూడా ఇందులో ప్రత్యేక పాత్ర పోషించడం... ఈ అంశాలన్నీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. సాయి కార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 20న తిరుపతిలోని మోహన్‌బాబు విద్యాసంస్థ అయిన ‘శ్రీవిద్యానికేతన్’లో విడుదల చేయనున్నారు. ఇక, సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. జయసుధ, శాన్వీ ఇందులో నాయికలు.