ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

RGV Kamma Rajyam Lo Kadapa Reddlu Movie 1st Song Release 9th - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాతో ఘన విజయం అందుకున్న వర్మ, ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఆ సమయంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ప్రమోషన్‌ కోసమే వర్మ ఈ ప్రకటన చేసినట్టుగా భావించారు.

కానీ వర్మ చెప్పినట్టుగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను ప్రారంభించాడు. ఎప్పుడు మొదలైందో.. ఎక్కడి వరకూ వచ్చిందో చెప్పకపోయినా, రేపు(09-08-2019) ఉదయం 9 గంటలకు ఈ సినిమా తొలి పాట ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తావివ్వని సినిమా అని చెపుతున్నాడు వర్మ. టైటిల్‌తోనే వివాదానికి తెర తీసిన వర్మ నిజంగా వివాదాలకు తావివ్వకుండానే ఈ సినిమా రూపొందిస్తున్నాడేమో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top