ఇండస్ట్రీ నాకు తగదు; కేవలం రెండు సినిమాలకే.. | Raveena Tandon Slams Zaira Wasim Over Her Comments Quit Industry | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీ నాకు తగదు; నష్టమేమీ లేదు!

Jul 1 2019 1:26 PM | Updated on Jul 1 2019 1:29 PM

Raveena Tandon Slams Zaira Wasim Over Her Comments Quit Industry - Sakshi

‘కేవలం రెండు సినిమాల్లో నటించిన వారు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఎలాంటి నష్టం లేదు. అన్నీ ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి కృతఙ్ఞతా భావంతో వెళ్లిపోతే బాగుంటుంది. పరిశ్రమపై వారి దురభిప్రాయాలను వారితో అంటిపెట్టుకుంటేనే బాగుంటుంది’ అంటూ బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌.. జైరా వసీమ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ‘దంగల్‌’ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె పాత్రలో కనిపించిన జైరా... సినిమాల నుంచి తప్పుకొంటున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు..‘  ‘‘ఐదేళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం (యాక్టర్‌గా మారాలని) నా జీవితాన్ని మార్చేసింది. ఎంతో ప్రేమను, అభిమానాన్ని ఇచ్చింది. ఈ ఇండస్ట్రీకి నేను తగినదాన్ని అయినా ఇండస్ట్రీ నాకు తగదనిపిస్తోంది.. నా ప్రశాంతతను కోల్పోయే పని చేయదలుచుకోలేదు.. అందుకే ఇండస్ట్రీ నుంచి వైదొలగాలనుకుంటున్నాను’’ అని ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

ఈ క్రమంలో జైరా వ్యాఖ్యలపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మతం కారణంగా లేదా మరే ఇతర కారణాల వల్లనో ఇండస్ట్రీలో అవకాశాలు చేజారవని, కేవలం ప్రతిభ కారణంగానే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఖాన్‌ల త్రయంతో పాటు వహీదా రెహమాన్‌, నర్గిస్‌, షబానా అజ్మీ, జీనత్‌ వంటి ఎంతోమంది ముస్లిం నటీనటులు ఇండస్ట్రీలో అగ్రపథాన నిలిచారని.. వారెవరికీ రాని ఇబ్బందులు జైరాకే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన నటి రవీనా టాండన్‌..‘ ఇండస్ట్రీని ఎల్లవేళలా ప్రేమిస్తాను. ప్రతీ ఒక్కరికి ఎన్నో అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే వెళ్లేముందు.. మన ప్రతిభ నిరూపించుకునేందుకు అవకాశమిచ్చిన ఇండస్ట్రీని కించపరిచేలా మాట్లాడటం సరైంది కాదు. ఇక్కడ అందరూ కలిసే పనిచేస్తారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా అంతా భుజం భుజం కలిపి పనిచేస్తారు’ అని జైరా తీరును విమర్శించారు.

ఇక మరికొంత మంది మాత్రం తన జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు జైరాకు ఉందని.. ఆమెను విమర్శించేందుకు మీరెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా ఈ విషయంపై స్పందించారు. ‘ జైరా వసీం నిర్ణయాన్ని సవాల్‌ చేసేందుకు మీరెవరు? తనకు సంతోషాన్నిచ్చే పనులనే తను చేస్తుంది. తను ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement