వారిని చూస్తే పాపం అనిపిస్తోంది

Rakul Preet Singh React on Her Cigarette Smoking Scene Trolling - Sakshi

సినిమా: మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తోంది అంటోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్‌. అందాలారబోత కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సై అనే ఈ అమ్మడికి ఇంతకు ముందు టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉండేది. ఇప్పుడు తగ్గిందని చెప్పక తప్పుదు. ఎందుకుంటే అమ్మడికిప్పుడు అవకాశాలు పెద్దగా లేవు. తెలుగులో చేసిన మన్మథుడు 2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రంలో అమ్మడి నటన గురించే చర్చ అంతా. నాగార్జునకు జంటగా నటించిన మన్మథుడు 2లో రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించింది. ఇందులో ఈ జాణ సిగరెట్‌ కాల్చే సన్నివేశం చేసింది. ఆ ఫొటోలు బయటకు రావడంతో నటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ విషయమై రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయినా ఆమెపై విమర్శల పర్వం కొనసాగడంతో చిరెత్తుకొచ్చినట్లుంది. అంతే ఎదురు దాడికి దిగింది. ఇంతకీ ఈ అమ్మడు ఏం అంటుందో చూద్దాం. ‘అవును నేను సిగరెట్‌ తాగే సన్నివేశంలో నటించాను.అయితే ఉంటీ? చిత్రాల్లో హీరోలు సిగరెట్లు తాగితే ఎవరూ ఏమీ అనడం లేదు.

ఒక నటి సిగరెట్‌ తాగితే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఇలాంటివన్నీ విశాల దృక్పథంతో చూడాలి. అయినా కథా పాత్రకు అవసరం అవ్వడంతోనే నేనలా నటించాను. మరో విషయం ఏమిటంటే  మనం అనుకుంటున్న దానికంటే నిజ జీవితంలో సమాజంలో ఇంకా దారుణంగా జరుగుతున్నాయి. సినిమాల్లో చూసే సన్నివేశాలు వాటి కంటే ఎంతే బెటర్‌. సినిమాల వల్ల సమాజం పాడైపోతోందనే వారిని చూస్తుంటే పాపం అనిపిస్తోంది’ అని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది. మొత్తం మీద సినిమాకు ముందే ఇలాంటి నెగిటివ్‌ పబ్లిసిటీతో భాగానే వార్తల్లో నానుతోంది. అయితే కొత్త అవకాశాలే రావడం లేదు. తెలుగులోనే కాదు తమిళంలోనూ అమ్మడికి అంతకంటే దారణంగా ఉంది. ఇక్కడ హిట్‌ చూసి చాలా కాలమే అయ్యింది. తాజాగా శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ముగ్గురు భామల్లో ఒకరిగా నటించే అవకాశం వరించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా  వెల్లడికాలేదు. ఇక తెలుగులో మన్మథుడు 2 చిత్రం విజయంపై రకుల్‌ప్రీత్‌సింగ్‌ జాతకం ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top