నాని ‘బాబు’.. లవ్యూ అంతే : రాజమౌళి | Rajamouli Reaction After Watching Nani Jersey Movie | Sakshi
Sakshi News home page

జెర్సీపై జక్కన్న ప్రశంసలు

Apr 22 2019 12:25 PM | Updated on Jul 14 2019 4:05 PM

Rajamouli Reaction After Watching Nani Jersey Movie - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి మంచి సినిమాలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే.. ఆ చిత్రాన్ని స్వయంగా వీక్షించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. గత శుక్రవారం విడుదలైన ‘జెర్సీ’ చిత్రం ఇప్పటికే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుండగా.. తాజాగా జక్కన్న ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

‘ఎంతో సూపర్బ్‌గా రాసి, సన్నివేశాలను అందంగా మలిచి.. తెరకెక్కించారు. గౌతమ్‌ తిన్ననూరి వెల్‌ డన్‌. సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరూ గర్వంగా ఫీల్‌ అయ్యేలా చేసే చిత్రం జెర్సీ.  నాని ‘బాబు’ జస్ట్‌ లవ్యూ అంతే’ అంటూ ట్వీట్‌చేశారు. శ్రద్దా శ్రీనాథ్ ఈ చిత్రంలో నానిని బాబు అంటూ పిలవగా.. జక్కన్న కూడా అదే స్టైల్లో నానిని.. బాబు అంటూ లవ్యూ అనేశారు.

Advertisement
 
Advertisement
Advertisement