నువ్వు సూపరు! | priyanka chopra says congrats to kangana ranaut | Sakshi
Sakshi News home page

నువ్వు సూపరు!

Mar 25 2015 11:48 PM | Updated on Sep 2 2017 11:22 PM

నువ్వు సూపరు!

నువ్వు సూపరు!

బాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య సయోధ్య చాలా తక్కువే. కలిసి తిరగడం... ఒకరి విజయాలు ఒకరు షేర్ చేసుకోవడం మరీ అరుదుగా కనిపించే విషయం.

బాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య సయోధ్య చాలా తక్కువే. కలిసి తిరగడం... ఒకరి విజయాలు ఒకరు షేర్ చేసుకోవడం మరీ అరుదుగా కనిపించే విషయం. కానీ... అదేమిటో ఈ మధ్య హిందీ ఫిల్మీ దునియాలో ఓ సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఓ ఫంక్షన్‌లో కనిపించిన అనుష్కాశర్మ బుగ్గపై దీపికా పడుకొనే ముద్దు పెట్టడం... దీపిక దిగిన హోటల్ సూట్ పక్కనే కత్రినా కూడా తన ప్రియుడితో బస చేయడం... వినడానికి కాస్త వింతగా ఉన్నా కాదనలేని వాస్తవం.

తాజాగా... విమర్శకుల ప్రశంసలు అందుకున్న
 ‘మేరీకోమ్’ పాత్రకు జాతీయ అవార్డు వస్తుందని భావించిన సూపర్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా... కంగనారనౌత్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ‘ఐ హేట్ లూజింగ్’ అంటూనే... ‘క్వీన్’ చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న కంగనాకు కంగ్రాట్స్ చెప్పింది ప్రియాంక. అలాగే ఆ సినిమా దర్శకుడు వికాస్‌ను కూడా ఆకాశానికెత్తేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement