మగాళ్లూ.. అలా చేయకండి! | Priyanka Chopra Quantico 2 shooting in United States | Sakshi
Sakshi News home page

మగాళ్లూ.. అలా చేయకండి!

Oct 3 2016 1:17 AM | Updated on Apr 4 2019 5:04 PM

మగాళ్లూ.. అలా చేయకండి! - Sakshi

మగాళ్లూ.. అలా చేయకండి!

అందమైన రూపం కోసం అమ్మాయిలు ఎన్నెన్నో చేస్తుంటారు. అందులో కనుబొమలను మంచి ఆకృతిలోకి షేప్ చేయించుకోవడం

అందమైన రూపం కోసం అమ్మాయిలు ఎన్నెన్నో చేస్తుంటారు. అందులో కనుబొమలను మంచి ఆకృతిలోకి షేప్ చేయించుకోవడం ఒకటి. అందమైన కళ్లను, ఆ కనుబొమలను చూసి మాయలో పడే కుర్రకారు ఉన్నారంటే అతిశయోక్తి కాదండి. ‘క్వాంటికో’ టీవీ సిరీస్ కోసం అమెరికాలో ఉన్న ప్రియాంక చోప్రా కళ్లను, కనుబొమలను చూసి ఓ సెలబ్రిటీ తెగ పొగిడేశాడు. మగాళ్లు కూడా కనుబొమలను షేప్ చేయించుకుంటే ఎలా ఉంటుందని ప్రియాంకను అడిగాడు.
 
 ‘‘ఓహ్... ఐ హేట్ దట్. కొన్ని పనులు అమ్మాయిలు మాత్రమే చేయాలి. మగాళ్లు వేసుకునే జీన్స్, టీ-షర్టులు మేం కూడా వేసుకుంటున్నామని, మీరు (మగాళ్లు) కనుబొమలు షేప్ చేయించుకోవడం వంటివి చేస్తే చిరాగ్గా ఉంటుంది. ప్లీజ్.. అలా చేయకండి’’ అని ప్రియాంక చోప్రా సమాధానం ఇచ్చారు. అసలు మగాళ్లు మేకప్ వేసుకుంటే ఆమెకు నచ్చదట. ‘‘ఆడవాళ్లలా మగాళ్లు ప్రత్యేకంగా తయారైతే బాగుండదండి బాబూ. అలంకరించుకునే హక్కు ఆడవాళ్లకే’’ అన్నారు ప్రియాంక.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement