జీజాజీ ఆగయా.. మీ అభిమానానికి ధన్యవాదాలు | Priyanka Chopra Explains When Nick Jonas Entered In Indian Theater | Sakshi
Sakshi News home page

‘అభిరుచులన్నింటినీ ఒకే క్షణం‍లో నాకు అందించావు’

Dec 16 2019 7:53 PM | Updated on Dec 16 2019 9:04 PM

Priyanka Chopra Explains When Nick Jonas Entered In Indian Theater - Sakshi

​గ్లోబల్‌ కపుల్‌ ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్‌లు అందరి కంటే అత్యంత ప్రియమైన జంట అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. పుట్టిన రోజు వేడుకలు, ప్రత్యేక రోజులలో ఒకరిని మించి ఒకరు సర్‌ప్రైజ్‌ ఇచ్చుకుంటూ ప్రేమను కురిపించుకుంటారు. తాజాగా ఈ జంట మొదటి వివాహా వార్షిక వేడుకను జరుపుకుంది. పెళ్లి రోజును ప్రత్యేకంగా ఉంచడానికి ప్రియాంక తన బిజీ షెడ్యూల్‌లో కూడా అమెరికా వెళ్లి నిక్‌కు ఇష్టమైన కుక్కను బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ నిక్‌పై ఈ గ్లోబల్‌ బ్యూటీ ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటుంది. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. నిక్‌ జోనస్‌ నటించిన ‘జుమాంజీ: ది నెక్స్ట్‌ లెవల్‌’ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను ప్రియాంక తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఇందులో నిక్‌ ఎంట్రీ ఇవ్వగానే అభిమానులంతా ‘జీజాజీ ఆగయా’ (బావ వచ్చాడు) అంటూ థియేటర్‌లో గట్టిగా అరుస్తున్న వీడియోకు ‘భారత్‌ థియేటర్‌లో నిక్‌ జోనస్‌’ అనే క్యాప్షన్‌కు ‘నేషనల్‌ జీజు’ అనే హ్యాష్‌ ట్యాగ్‌కు జత చేశారు. అలాగే మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు‍ అంటూ ​ప్రియాంక రాసుకొచ్చారు.

తాజాగా ఈ జంట మొదటి వివాహ వార్షిక వేడుకను జరుపుకున్న సందర్భంగా ప్రియాంక ‘అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.. ఆనందం, ప్రేమ, ఉత్సాహం, అభిరూచులన్నింటినీ ఒకే క్షణంలో నాకు అందించారు. నన్ను మీ భార్యగా స్వీకరించినందుకు ధన్యవాదాలు, హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ మై హజ్బెండ్‌’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అలాగే నిక్‌ జోనస్‌ కూడా వారి పెళ్లి రోజున ‘ ఏడాది క్రితం నుంచి ఈ రోజు వరకు, ఎప్పటికీ నిన్ను నా హృదయంలో నింపుకున్నాను.. ఐ లవ్‌ యూ ప్రియాంక’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా రాజ్‌కుమార్‌ రావుకు జోడిగా ‘వైట్‌ టైగర్‌’, ‘సూపర్‌ హీరోస్‌’ వెబ్‌సిరీస్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘డిస్నీస్‌ ఫ్రోజన్‌’లో తన సోదరి పరిణితి చొప్రాతో కలిసి నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement