గాయపడ్డ హీరోయిన్‌.. మెడకు బ్యాండేజ్‌ | Parineeti Chopra Injured In Saina Nehwal Biopic Shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో గాయపడ్డ పరిణీతి చోప్రా

Nov 16 2019 10:09 AM | Updated on Nov 16 2019 10:18 AM

Parineeti Chopra Injured In Saina Nehwal Biopic Shooting - Sakshi

గాయం కూడా కాకుండా నేను, చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ అది జరిగిపోయింది.

ముంబై: బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సైనా’. భారత బ్యాడ్మింటన్‌  స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా పరిణీతి గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ డ్యూడ్స్‌... ‘సైనా’  షూటింగ్‌ సమయంలో నాకు చిన్న గాయం కూడా కాకుండా నేను, చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ అది జరిగిపోయింది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత బ్యాడ్మింటన్‌ ఆడేందుకు మళ్లీ సిద్ధమైపోతాను అని పరిణీతి ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. మెడకు బ్యాండేజ్‌తో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు.

ఈ క్రమంలో పరిణీతి త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇష్క్‌జాదే సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన పరిణీతి.. శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, దావత్‌-ఏ-ఇష్క్‌, నమస్తే ఇంగ్లండ్‌ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన కేసరి, జబరియా జోడి సినిమాలు ఈ ఏడాది విడుదల కాగా.. ప్రస్తుతం ఆమె సైనా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో సైనా పాత్రకు తొలుత శ్రద్ధా కపూర్‌ను తీసుకోగా.. ఇతర సినిమాల కారణంగా కాల్షీటు సర్దుబాటు చేయలేకపోవడంతో ఆ అవకాశం పరిణీతి వరించింది. కాగా పరిణీతి గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రో కజిన్‌ అన్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement