ఆ ఇద్దరితో సినిమా కన్నా పెళ్లే సుఖం! | marriage is best than acting with sharuk and amir | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరితో సినిమా కన్నా పెళ్లే సుఖం!

Dec 21 2014 8:14 AM | Updated on Sep 2 2017 6:29 PM

ఆ ఇద్దరితో సినిమా కన్నా పెళ్లే సుఖం!

ఆ ఇద్దరితో సినిమా కన్నా పెళ్లే సుఖం!

సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లు ముగ్గురూ కలిసి ఓ సినిమాలో నటిస్తే? కచ్చితంగా ఆ చిత్రం కనువిందుగా

 సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లు ముగ్గురూ కలిసి ఓ సినిమాలో నటిస్తే? కచ్చితంగా ఆ చిత్రం  కనువిందుగా ఉండటంతో పాటు కనక వర్షం కురిపించడం ఖాయం. అందుకే, ఈ ముగ్గురు ఖాన్‌లూ ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఉందని హిందీ చిత్రసీమవారూ, ప్రేక్షకులూ కోరుకుంటున్నారు.

కానీ, ఈ ఖాన్స్ కలిసి నటించే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే.. ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ, ‘‘ఆ ఇద్దరితో కలసి సినిమా చేయడం కన్నా నేను పెళ్లి చేసుకోవడం సుఖం’’ అని పేర్కొన్నారు.  మరి.. మిగతా ఇద్దరి ఖాన్‌ల అభిప్రాయం ఏంటో?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement