మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..! | Mahesh Babu Movie Lucknow schedule ends abruptly | Sakshi
Sakshi News home page

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

Aug 19 2017 1:22 PM | Updated on May 10 2018 12:13 PM

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..! - Sakshi

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

స్పైడర్ సినిమా సెట్స్ మీద ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

స్పైడర్ సినిమా సెట్స్ మీద ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తనకు శ్రీమంతుడు లాంటి ఘనవిజయం అందించిన కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ లేకుండానే కొంత షూటింగ్ పూర్తి చేసిన మూవీ యూనిట్, మహేష్ అందుబాటులోకి వచ్చిన తరువాత లక్నో లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసింది.

కొన్ని సీన్స్ తో పాటు ఓ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసిన కొరటాల టీం.. లక్నో షూటింగ్ ను అర్థాంతరంగా ముంగించుకోవాల్సి వచ్చింది. లక్నోలోని కొన్ని చారిత్రక కట్టడాల్లో యాక్షన్ సీన్స్ షూట్ చేయాలనుకున్న భరత్ అను నేను టీంకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బ్రేక్ వేసింది. వారసత్వ భవానలకు హాని కలిగే అవకాశం ఉందన్న కారణంతో అధికారులు షూటింగ్ కు పర్మిషన్ నిరాకరించారు. దీంతో మహేష్ మూవీ టీం అర్థాంతరంగా షూటింగ్ ముగించుకొని తిరిగొచ్చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement