‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

Kamal Haasan's Indian 2 to Release For 2021 Tamil New Year - Sakshi

లోకనాయకుడు కమల్‌ హాసన్‌, స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ఇండియన్‌ 2. సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పరిస్థితి ఒక్క అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. ఈ సినిమాను ముందుగా దిల్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కించాలని భావించారు. కానీ బడ్జెట్‌ కారణంగా సినిమా లైకా ప్రొడక్షన్స్‌ చేతికి వెళ్లింది.

అయితే లైకా సంస్థ కూడా బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్‌కు ఆంక్షలు పెట్టడంతో దాదాపు ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే అని భావించారు అంతా. లైకా పెట్టిన కండిషన్స్‌కు శంకర్‌ ఓకే చెప్పటంతో ఇండియన్‌ 2 పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కమల్ కూడా ఎన్నికల హడావిడి ముగించుకొని షూటింగ్‌లకు సిద్ధం కావటంతో ఇండియన్‌ 2ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమా ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. భారీ చిత్రం కావటంతో షూటింగ్‌కే ఎక్కువ రోజులు సమయం పడుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్‌కు ఏడాదిన్నరకు పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. హడావిడి చేయకుండా పక్కాగా ఓకే అనుకున్న తరువాత 2021 మార్చిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంకర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top