'ఎమ్మెల్యే'గా నందమూరి యంగ్ హీరో..? | Kalyan Ram Next Movie Title MLA | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యే'గా నందమూరి యంగ్ హీరో..?

Mar 21 2017 4:03 PM | Updated on Sep 5 2017 6:42 AM

'ఎమ్మెల్యే'గా నందమూరి యంగ్ హీరో..?

'ఎమ్మెల్యే'గా నందమూరి యంగ్ హీరో..?

నందమూరి యువ కథానాయకుడు ఎమ్మెల్యేగా మారుతున్నాడు. హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్

నందమూరి యువ కథానాయకుడు ఎమ్మెల్యేగా మారుతున్నాడు. హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్.. త్వరలో ఓ ఇంట్రస్టింగ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. ఇజం సినిమా తరువాత దాదాపు ఆరు నెలల పాటు కాలీగా ఉన్న కళ్యాణ్ రామ్, ఇటీవల ఉపేంద్ర అనే కొత్త దర్శకుడి కథను ఓకె చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్.

ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీద ఉండగానే తను హీరోగా తెరకెక్కబోయే సినిమాను కూడా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఎమ్మెల్యే' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. అనీల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన పటాస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్.. మరో సారి కొత్త దర్శకుడితో కలిసి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement