జెర్సీ దర్శకుడితో మెగా హీరో

Jersey Fame Gautham Tinnanuri Next Movie With Varun Tej - Sakshi

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో దర్శకుడు గౌతమ్‌ను భారీ ఆఫర్‌లు వరిస్తున్నాయి.

ప్రస్తుతం జెర్సీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న గౌతమ్‌ తన తదుపరి చిత్రాన్ని మెగా హీరోతో చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి ప్రయోగాత్మ చిత్రాలకు ఓటు వేస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్‌, గౌతమ్‌తో సినిమా చేసేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్, గౌతమ్‌తో సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top