ఇళయదళపతితో మరోసారి? | Ileana romance again with Vijay | Sakshi
Sakshi News home page

ఇళయదళపతితో మరోసారి?

Mar 5 2014 11:22 PM | Updated on Aug 28 2018 4:30 PM

ఇళయదళపతితో మరోసారి? - Sakshi

ఇళయదళపతితో మరోసారి?

ఇళయదళపతి విజయ్‌తో మరోసారి రొమాన్స్ చేయాలనే ఆకాంక్షను నటి ఇలియానా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తొలుత కోలీవుడ్‌లో కేడీ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసినా

ఇళయదళపతి విజయ్‌తో మరోసారి రొమాన్స్ చేయాలనే ఆకాంక్షను నటి ఇలియానా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తొలుత కోలీవుడ్‌లో కేడీ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసినా ఆశించిన ఫలితం రాకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ తొలి చిత్రం దేవదాస్ అనూహ్య విజయం సాధించడంతో ఇలియానా హవా ఆరంభం అయ్యింది. టాలీవుడ్‌లో క్రేజీ నటిగా వెలుగొందుతున్న తరుణంలో కోలీవుడ్ ఆహ్వానం పలికింది. శంకర్ దర్శకత్వం వహించిన నన్భన్ చిత్రంలో విజయ్‌తో జత కట్టింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.
 
 పస్తుతం బాలీవుడ్‌పైనే పూర్తిగా దృష్టి సారించిన ఇలియానా తాజాగా మరోసారి విజయ్‌తో రొమాన్స్ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. విజయ్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో చెన్నై చిన్నది సమంత హీరోయిన్. ఈ చిత్రం తరువాత విజయ్ యువ దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రంలో ఆయనతో ఇలియూనా జతకట్టాలనుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆమె రాయబారం పంపినట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని వారిలో ఒక పాత్ర కు ఇప్పటికే అందాలభామ ప్రియాంక చోప్రా ఎంపికైనట్లు సమాచారం. ఈ బ్యూటీ కూడా ఇంతకుముందు విజయ్‌తో తమిళన్ అనే చిత్రంలో జత కట్టారన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement