హృతిక్, కంగనా గొడవకు ఫుల్ స్టాప్ లేదా? | Hrithik Roshan and Kangana Ranaut bitter battle continues | Sakshi
Sakshi News home page

హృతిక్, కంగనా గొడవకు ఫుల్ స్టాప్ లేదా?

May 3 2016 10:24 AM | Updated on Apr 3 2019 6:34 PM

హృతిక్, కంగనా గొడవకు ఫుల్ స్టాప్ లేదా? - Sakshi

హృతిక్, కంగనా గొడవకు ఫుల్ స్టాప్ లేదా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో మాజీ ప్రేమికులు కంగనా రనౌత్, హృతిక్ రోషన్ ల మధ్య తలెత్తిన వివాదం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ ఇండస్ట్రీలో మాజీ ప్రేమికులు కంగనా రనౌత్, హృతిక్ రోషన్ ల మధ్య తలెత్తిన వివాదం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. గొడవ సద్దుమణగడానికి వీరిద్దరి తరఫు బంధువులు, సన్నిహితుల ప్రయత్నాలు సఫలం కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, లీగల్ నోటీసులు పంపుకున్న విషయం తెలిసిందే. ఒకరు సెటైర్లు వేయడం మరొకరు దానికి స్పందించడం జరుగుతూనే ఉన్నా ఈ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. తప్పయిందని ఒకరు ఒప్పుకోరు, రాజీకి వచ్చే ప్రస్తకే లేదని మరొకరు తేల్చి చెబుతున్నారు.

కంగనా పంపిన్ మెయిల్స్ ను హృతిక్ బయటపెట్టడంతో గొడవ మరింత పెద్దదైంది. దాంతో కంగనా కోపం మరింత రెట్టిపయింది. తన మెయిల్ ను హ్యాక్ చేసిన తర్వాత, తన పేరుతో ఫేక్ ఈమెయిల్ అకౌంట్ ఉందంటూ హృతిక్ ఫిర్యాదు చేయడంపై కంగనా ప్రశ్నించింది. ఈ వివాదంపై హృతిక్, కంగనా ఇద్దరిదీ చేరో దారని అర్థమవుతోంది. గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని సన్నిహితులు సూచిస్తున్నా వీరి నుంచి సరైన రెస్పాన్స్ లేదట. జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవడానికి 'క్వీన్' ఫేమ్ కంగనా ఢిల్లీకి వెళ్లనుంది.

కూతురి విజయం పట్ల ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అవార్డు అందుకోవడాన్ని చూడాలని వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హృతిక్ తో వివాదానికి కాస్త దూరంగా ఉండేందుకు కంగనా ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. మరో వారం రోజుల్లో సోదరి రంగోలితో కలిసి లండన్, పారిస్ చుట్టిరానుంది. ఆ తర్వాత తన ఫేవరెట్ స్పాట్ స్విట్జర్లాండ్ లో కొన్ని రోజులు గడపాలనుకుంటోంది కంగనా. హృతిక్, కంగనాలకు ఎలా ఉన్నా.. వారిద్దరి కామన్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ సన్నిహితులకు మాత్రం వీరి వివాదం అంతగా రుచించడం లేదు. ఇద్దరు రాజీకి వస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement