సూర్య సిస్టర్‌ సింగర్‌ అయ్యారోచ్‌ | Heroine sister who has entered film industry | Sakshi
Sakshi News home page

సూర్య సిస్టర్‌ సింగర్‌ అయ్యారోచ్‌

Apr 27 2018 12:53 AM | Updated on Nov 6 2018 4:10 PM

Heroine sister who has entered film industry - Sakshi

బృందా, సూర్య

సూర్య ఫ్యామిలీలో చాలా మంది ఆల్రెడీ సినిమాల్లో ఉన్నారు. నాన్న శివకుమార్‌. తమ్ముడు కార్తీ, భార్య జ్యోతిక. అందరూ యాక్టర్సే. ఇప్పుడు సూర్య చెల్లెలు బృందా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే.. యాక్టర్‌గా కాదు.. సింగర్‌గా. సీనియర్‌ తమిళ నటుడు కార్తీక్, తనయుడు గౌతమ్‌ కార్తీక్‌ కలిసి నటిస్తోన్న ‘మిస్టర్‌ చంద్రమౌళి’ సినిమా ద్వారా బృందా గాయనిగా పరిచయం కానున్నారు. శ్యామ్‌.సి మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఇటీవల జరిగింది.

బృందా మాట్లాడుతూ– ‘‘శ్యామ్‌ సార్‌ నన్ను ఓ డెబ్యూ సింగర్‌గా ట్రీట్‌ చేయలేదు. రికార్డింగ్‌ అప్పుడు కంఫర్ట్‌బుల్‌గా ఫీల్‌ అయ్యేలా చేశారు. అవుట్‌పుట్‌ బాగుంటేనే నా పాటని సినిమాలో పెట్టండి అని కోరాను. కానీ, నేను బాగా పాడతానని ఆయన ఫస్ట్‌ నుంచి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కి థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారామె.  సూర్య, కార్తీ యాక్టర్స్‌గా తెలుగు, తమిళంలో ప్రూవ్‌ చేసుకున్నారు. మరి..  సింగర్‌గా బృందా ఎన్ని మార్కులు వేయించుకుంటారో? బ్రదర్స్‌లాగే ఇండస్ట్రీలో ఎలా ప్రూవ్‌ చేసుకుంటారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement