‘యాత్ర 2’ కథ అక్కడ మొదలవుతుంది! | Director Mahi V Raghv Tweet Yatra 2 | Sakshi
Sakshi News home page

‘యాత్ర 2’ కథ అక్కడ మొదలవుతుంది!

May 29 2019 1:14 PM | Updated on May 29 2019 5:20 PM

Director Mahi V Raghv Tweet Yatra 2 - Sakshi

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన మహి వీ రాఘవ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో యాత్ర 2 సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ యాత్ర 2కు సంబంధించిన హింట్‌ ఇచ్చారు దర్శకుడు మహి.

తాజాగా యాత్ర 2 సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. ‘వైఎస్‌ రాజా రెడ్డి, వైఎస్‌ జగన్‌ ల గురించి చెప్పకుండా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కథ పూర్తి కాదు. యాత్ర 2 ఆయన కథను పరిపూర్ణం చేస్తుంది. రాజశేఖర్‌ రెడ్డి యాత్ర తన తండ్రి సమాధి దగ్గర నుండి ప్రారంభమైంది. అలాగే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి యాత్ర కూడా ప్రారంభమైంది’ అంటూ ట్వీట్ చేశారు మహి వీ రాఘవ.

పావురాల గుట్ట దగ్గర వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తన తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయిన వారిని స్వయంగా వచ్చి కలుస్తానని ప్రజలకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులు. ఎన్ని కష్టాలు ఎదురైన మాట నిలబెట్టుకునేందుకు వైఎస్‌ జగన్‌ ముందడుగు వేయటం, 9 ఏళ్ల పోరాటం తరువాత అఖండ విజయం సాధించటం లాంటి అంశాల నేపథ్యంలో సీక్వెల్‌ సాగుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement