వీరాభిమాని చర్యతో రకుల్‌ ప్రీత్‌ దిగ్భ్రాంతి | die hard fan blood letter to rakul preet | Sakshi
Sakshi News home page

వీరాభిమాని చర్యతో రకుల్‌ ప్రీత్‌ దిగ్భ్రాంతి

Dec 29 2016 12:45 PM | Updated on Jul 23 2019 11:50 AM

వీరాభిమాని చర్యతో రకుల్‌ ప్రీత్‌ దిగ్భ్రాంతి - Sakshi

వీరాభిమాని చర్యతో రకుల్‌ ప్రీత్‌ దిగ్భ్రాంతి

2016 సంవత్సరాన్ని సంతోషంగా ముగించాలనుకున్న టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ కు ఊహించని అనుభవం ఎదురైంది.

2016 సంవత్సరాన్ని సంతోషంగా ముగించాలనుకున్న టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌.. తన స్నేహితురాలైన మరో హీరోయిన్‌కు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. హీరోయిన్‌ సీరత్‌ కపూర్‌(రన్‌రాజా రన్‌ ఫేమ్‌)ను పిచ్చిగా ఆరాధించే ఓ అభిమాని, ఆమె పేరులోని ఎస్‌ అక్షరాన్ని చేతిపై కత్తితో గీసుకుని ఆ ఫొటోను హీరోయిన్‌కే పంపాడు. ఆ వెర్రి అభిమాని చేసిన పని తనకు ఎంతో ఆవేదన కలిగించిందని, దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని సీరత్‌ కపూర్‌ ట్విటర్‌ ద్వారా కోరింది.

నటిగా ఎంతోమందిని ప్రభావితం చేసే వరం తనకు దక్కిందని, ఇటువంటి చర్యల ద్వారా దాన్ని దుర్వినియోగం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. జీవితం ఎంతో విలువైందని, ఎవరికి వారు సంతోషంగా జీవించాలని కోరుకుంది. నటీనటులపై అభిమానంతో మీకు మీరు ఎటువంటి హనీ తలపెట్టకుకోవద్దని అందరి తరపున విజ్ఞప్తి చేసింది. ఎవరి ఆశయాలకు వారు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, తర్వాతే నటులను అభిమానించాలని సూచించింది. సీరత్‌ పోస్ట్‌ చేసిన ఈ విజ్ఞప్తిని రకుల్‌ రీట్వీట్‌ చేయడంతో వైరల్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement