అమితాబ్‌కు మెగాస్టార్‌ చిరు ట్వీట్‌ | Coronavirus Megastar Chiranjeevi Tweet Amitabh Ji Get Well Soon | Sakshi
Sakshi News home page

అమితాబ్‌కు మెగాస్టార్‌ చిరు ట్వీట్‌

Jul 12 2020 9:33 AM | Updated on Jul 12 2020 1:34 PM

Coronavirus Megastar Chiranjeevi Tweet Amitabh Ji Get Well Soon - Sakshi

సాక్షి, ముంబై: కోవిడ్‌ బారినపడ్డ బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77) త్వరలో కోలుకోవాలని మెగాస్టార్‌ చిరంజీవి ఆకాక్షించారు. అమితాబ్‌ జీ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చిరు ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని  అమితాబ్‌ శనివారం సాయంత్రం ట్విట్టర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి అధికారులు నాతోపాటు మా కుటుంబ సభ్యులు, సిబ్బందికి కూడా పరీక్షలు చేయించారు. వారికి సంబం ధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది’ అని అందులో వివరించారు.


(చదవండి: కాంబినేషన్‌ రిపీట్‌?)

ఇక ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా తనకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు శనివారం అర్ధరాత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. జయాబచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యకు కరోనా నెగెటివ్‌గా తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలాఉండగా.. ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పి రేటరీ ఐసోలేషన్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్న అమితాబ్‌, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు ప్రకటించారు. తమ అభిమాన నటులు కోవిడ్‌ నుంచి క్షేమంగా బయటపడాలని దేశవ్యాప్తంగా వారి అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు ట్వీట్లలో సంఘీభావం తెలుపుతున్నారు.
(అమితాబ్‌, అభిషేక్‌లకు కరోనా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement