కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే : చిరంజీవి | Chiranjeevi Clarifies on Mother Anjanadevi news over fight on Corona virus | Sakshi
Sakshi News home page

కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే : చిరంజీవి

Apr 11 2020 3:27 PM | Updated on Apr 11 2020 3:34 PM

Chiranjeevi Clarifies on Mother Anjanadevi news over fight on Corona virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు. తన తల్లి అంజనాదేవి కరోనాపై పోరులో భాగంగా మాస్క్‌లు కుట్టారని వచ్చిన వార్తపై స్పష్టత ఇచ్చారు. అంజనాదేవి గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారని, వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ఫోటోలతోపాటూ వైరల్‌ అయ్యాయి. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు.

అయితే ఆ ఫోటోల్లో ఉంది తన తల్లి అంజనాదేవి కాదని ట్విటర్‌లో స్పష్టత ఇవ్వడమే కాకుండా, ఆ ఫోటోల్లో ఉన్న మహిళను చిరంజీవి అభినందించారు. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మేనని పొగడ్తలతో ముంచెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement