చిరు స్పెషల్‌గా.. సుధీర్‌ వెరైటీగా | Chiranjeevi And Sudheer Babu Special Birthday Wishes To Krishna | Sakshi
Sakshi News home page

కృష్ణ బర్త్‌డే: సుధీర్‌ డబ్‌స్మాష్‌ అదిరింది

May 31 2020 12:15 PM | Updated on May 31 2020 1:08 PM

Chiranjeevi And Sudheer Babu Special Birthday Wishes To Krishna - Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ ఈరోజు 77వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు, టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నటశేఖరుడు కృష్ణకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘కథానాయకుడిగా 345 సినిమాలు.. దర్శకుడిగా 14 చిత్రాలు. నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70 ఎమ్‌ఎమ్‌‌ చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్‌ రికార్డు. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూపర్‌స్టార్‌ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ఆయనతో కలిసి దిగిన ఫోటోను కూడా ట్వీట్‌లో జతచేశారు. (మహేశ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్‌)

కాగా, కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న అల్లుడు సుధీర్ బాబు సరికొత్త స్టైల్‌లో విషెస్ చెప్పారు. కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామ‌రాజు చిత్రంలోని ఎమోషన్‌ డైలాగ్‌కు డ‌బ్ స్మాష్ చేసి కాస్త వైవిధ్యంగా జన్మదిన శుభాకాంక్ష‌లు అందించారు. ఎంతో ఉద్వేగభరితంగా ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సుధీర్‌బాబు నటనకు నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు.  కృష్ణ కోడలు, మహేశ్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ తన మామకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమ్రంలో ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. వీరితో పాటు టాలీవుడ్‌కు చెందిన అనేక మంది ప్రముఖులు సూపర్‌ స్టార్‌ కృష్ణకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఇటు కృష్ణ బర్త్‌డే అటు మహేశ్‌ కొత్త సినిమా ప్రకటనతో సోషల్‌ మీడియాలో దద్దరిల్లిపోతోంది. (నిన్న రావు రమేష్‌.. నేడు ఉత్తేజ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement