గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నా: అనుష్క

Anushka Sharma Says I Am Married to the Greatest Man in the World - Sakshi

ముంబై : ప్రపంచంలోనే ఓ గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని బాలీవుడ్‌ నటి, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్కశర్మ పేర్కొన్నారు. ఆమె తాజా చిత్రం సూయి దగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌ ఏమోగానీ ఆమె ఈ మధ్య సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. చిత్రంలోని కొన్ని సీన్స్‌లోని అనుష్క యాక్టింగ్‌కు సంబంధించిన మేమ్స్‌ నెటిజన్లకు నవ్వులు పూయిస్తున్నాయి. మరోవైపు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న విరాట్‌ కోహ్లి శతకం బాదినా ఈమె పేరే వినిపిస్తోంది. రెండో టెస్ట్‌ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ విజయానికి కారణం తన సతీమణి అనుష్క శర్మనేనని, ఈ విజయాన్ని ఆమెకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కాస్త విరామం దొరికిన ఈ బాలీవుడ్‌ భామ ఇంగ్లండ్‌లో ప్రత్యక్షమవుతోంది. స్వయంగా మ్యాచ్‌లకు హాజరవుతూ తన భర్తను ప్రోత్సాహిస్తున్నారు. కోహ్లి ఏమో సెంచరీ అనంతరం ఓ ఫ్లయింగ్‌ కిస్స్‌తో తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇలా ఇద్దరు తమ ప్రొఫెషన్స్‌తో ఎంతో బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరికి ఉన్న వారి ప్రేమను చాటుకుంటున్నారు. సూయి ధాగా తొలి సాంగ్‌ విడుదల సందర్భంగా జైపూర్‌లో అభిమానులు విరాట్‌ కోహ్లి నామస్మరణం జపించారు. ఈ రెస్పాన్స్‌కు అనుష్క స్పందిస్తూ.. అతన్ని అందరూ ప్రేమిస్తారు.. నేను కూడా ప్రేమిస్తానని, ఎవరూ మరిచిపోలేరని నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top