అమలా ఏమిటీ గోల!

Amala Paul New Photo Viral In Social media - Sakshi

నటి అమలాపాల్‌ వివాదాస్పద చర్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తుంది. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో పాపులర్‌ అయిన ఈ కేరళా కుట్టి హీరోయిన్‌గా ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే ఏడాది తిరిగొచ్చే సరికి ఆయనతో విడాకులు కూడా తీసుకుని మళ్లీ ఫ్రీ బర్డ్‌లా మారిపోయింది. ప్రస్తుతం నటనపై దృష్టి సారిస్తున్న ఈ జాణ ఎప్పుడూ ఏదో ఒక సంఘటనతో వార్తల్లోకెక్కుతోంది. ఆ మధ్య ఖరీదైన కారును కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిష్ట్రేషన్‌తో వివాదాల్లో ఇరుక్కుంది. ఇక ఇటీవల తననొక వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి కలకలాన్ని సృష్టించింది.

ఇక సెక్సీ దుస్తులు ధరించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ నెటిజన్లకు చేతి నిండా పని చెప్పే అమలాపాల్‌ మరోసారి వివాదాస్పద చర్యలకు పాల్పడింది. తరచూ విహార యాత్రలు చేసే అమలాపాల్, కేరళాలోని అడవీ ప్రాంతాల్లో ఒంటరిగా బైక్‌లో రౌండ్లు కొట్టొస్తుంటుంది. అలాగా తాజాగా కాషాయ రంగు లుంగీని పైకి ఎగగట్టి చేతిలో సీమ సరకు బాటిల్‌ను పట్టి అడవి ప్రాంతంలో ఎనుక్కు తిరిగి చూస్తున్నట్లు ఫొటో తీయించుకుని ఆ ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అంతే కాదు లుంగీలకు ముఖ్యమైన ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ప్రతి వ్యక్తి చేపల కూర తింటూ నాటు సారా పట్టేస్తుంటారు. ఈ రోజు బాగా తాగవచ్చు. ఎంజాయ్‌ చేద్దాం అని పేర్కొంది. అమలాపాల్‌ ఈ చర్యలకు విమర్శలతో పాటు అభిమానుల నుంచి లైక్‌లు తెగ వస్తున్నాయి. కొందరు లుంగీలో సూపర్‌గా ఉన్నావని అంటే, మరి కొందరు ఏమ్మా అమలాపాల్‌ ఏమీటీ గోల. ఎందుకు ఇలా తయారయ్యావు? అని ప్రశ్నిస్తున్నారు. ఇక నెటిజన్లు అయితే ఈ అమ్మడిపై విమర్శల దాడి చేస్తున్నారు. అయితే విమర్శలను ఏనాడు లెక్క చేయని అమలాపాల్‌కు ఆశించిన ఫ్రీ ప్రచారం పొందడంలో సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top