మరోసారి సమ్మర్ బరిలో | allu arjun, pawan kalyan, mahesh babu planing summer release | Sakshi
Sakshi News home page

మరోసారి సమ్మర్ బరిలో

Jul 9 2016 1:30 PM | Updated on Mar 22 2019 5:33 PM

మరోసారి సమ్మర్ బరిలో - Sakshi

మరోసారి సమ్మర్ బరిలో

ఈ ఏడాది సమ్మర్ బరిలో భారీ పోటి నెలకొంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ బరిలో దిగటంతో సమ్మర్ హీట్ మరింతగా పెరిగిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ సర్థార్ గబ్బర్సింగ్...

ఈ ఏడాది సమ్మర్ బరిలో భారీ పోటీ నెలకొంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ బరిలో దిగటంతో సమ్మర్ హీట్ మరింతగా పెరిగిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్సింగ్, మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమా ఒక్కటే హిట్ లిస్ట్లో చేరింది.

అయితే వచ్చే ఏడాది కూడా ఈ స్టార్స్ మరోసారి తలపడేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత మురుగదాస్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న మహేష్ బాబు ఈ యాక్షన్ డ్రామాను సమ్మర్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక పవర్ స్టార్ కొత్త సినిమాను ముందు సంక్రాంతికే ప్లాన్ చేసినా.. డైరెక్టర్ మార్పుతో వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న అల్లు అర్జున్, హరీష్ శంకర్ల సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. బన్నీకి బాగా కలిసొచ్చిన సమ్మర్ సీజన్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్స్ ఒకేసారి బరిలో దిగకపోయినా.. ఒకే సీజన్లో వస్తే మాత్రం కలెక్షన్ విషయంలో ఇబ్బందులు తప్పవన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement