శంకర్‌ సినిమాలో మరోసారి విలన్‌గా..!

Akshay Kumar to Play the Villain Opposite Kamal Haasan In Indian 2 - Sakshi

ఇటీవల 2.ఓ తో సంచలనం సృష్టించిన దర్శకుడు శంకర్‌, తన తదుపరి చిత్ర పనులు ప్రారంభించాడు. కమల్ హాసన్ హీరోగా గతంలో ఘనవిజయం సాధించిన ఇండియన్‌ సినిమాకు సీక్వల్‌గా ఇండియన్‌ 2ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాకు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

ముందుగా ఈ సినిమాలో ప్రతినాయక పాత్రకు అజయ్‌ దేవగన్‌ను తీసుకోవాలని భావించారు. అజయ్‌ డేట్స్‌ ఖాళీ లేకపోవటంతో మరోసారి 2.ఓలో ప్రతినాయకుడిగా నటించిన అక్షయ్‌ కుమార్‌నే తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే అక్షయ్‌ ఇండియన్‌ 2 లో నటించేది లేనిది ఇంకా తెలియాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top