'ఆయన ఫోన్ నంబర్ అడిగేంత ధైర్యం లేదు' | Akshay Kumar Dont Have Rajini Sirs Phone Number | Sakshi
Sakshi News home page

'ఆయన ఫోన్ నంబర్ అడిగేంత ధైర్యం లేదు'

Jan 28 2016 1:59 PM | Updated on Sep 3 2017 4:29 PM

'ఆయన ఫోన్ నంబర్ అడిగేంత ధైర్యం లేదు'

'ఆయన ఫోన్ నంబర్ అడిగేంత ధైర్యం లేదు'

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మంచి జోష్లో ఉన్నాడు. అక్షయ్ హీరోగా తెరకెక్కిన ఎయిర్ లిఫ్ట్, కలెక్షన్ల హవా సృష్టిస్తుండగా, అక్షయ్ నటనకు ప్రశంసల వర్షం...

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మంచి జోష్లో ఉన్నాడు. అక్షయ్ హీరోగా తెరకెక్కిన ఎయిర్ లిఫ్ట్, కలెక్షన్ల హవా సృష్టిస్తుండగా, అక్షయ్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 100 కోట్ల మార్క్ను ఈజీగా రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో పాటు తొలిసారిగా సౌత్ ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతున్నాడు అక్షయ్ కుమార్.

రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమాలో నెగెటివ్ రోల్లో నటిస్తున్నాడు అక్షయ్. ఇప్పటికే ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ బాలీవుడ్ స్టార్, త్వరలోనే షూటింగ్లో పాల్గొనటానికి రెడీ అవుతున్నాడు.  రోబో సినిమాలో కలిసి నటిస్తున్న అక్షయ్ కుమార్, రజనీ కాంత్లకు ఒకేసారి పద్మ అవార్డులు ప్రకటించటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు.

ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో అక్షయ్ చెప్పిన సమాధానం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. రజనీ కాంత్ గారు పద్మ విభూషణ్ అందుకుంటున్నారు కదా.. మీరు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారా అన్న ప్రశ్నకు...' నాదగ్గర రజనీ సార్ ఫోన్ నంబర్ లేదు.. ఆయన్ని ఫోన్ నంబర్ అడిగేంత ధైర్యం నాకు లేదు' అంటూ సమాధానం ఇచ్చాడు అక్షయ్ కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement