హీరోగా ప్రభుదేవా రీఎంట్రీ | actor prabhu deva re-entry hero role | Sakshi
Sakshi News home page

హీరోగా ప్రభుదేవా రీఎంట్రీ

Mar 10 2016 3:21 AM | Updated on Sep 18 2019 2:56 PM

హీరోగా ప్రభుదేవా రీఎంట్రీ - Sakshi

హీరోగా ప్రభుదేవా రీఎంట్రీ

ప్రభుదేవా రీఎంట్రీ అవుతున్నారు. డాన్స్, నటన, దర్శకత్వంలో రాణించడంతో పాటు, బహుభాషా కళాకారుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా

 ప్రభుదేవా రీఎంట్రీ అవుతున్నారు. డాన్స్, నటన, దర్శకత్వంలో రాణించడంతో పాటు, బహుభాషా కళాకారుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా 2004 విజయకాంత్‌తో కలసి నటించిన ఎంగళ్ అన్నా చిత్రం విడుదలైంది. ఆ తరువాత ఆయన నటించిన తమిళ చిత్రం తెరపైకి రాలేదు. ఆ మధ్య కలవాడియ పొళుదుగళ్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించినా ఆ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దర్శత్వం పైనే దృష్టి సారించిన ప్రభుదేవా బాలీవుడ్‌లో పలు భారీ చిత్రాలను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు.
 
 తాజాగా కోలీవుడ్‌లో హీరోగా రీఎంట్రీ కానున్నారు.విజయ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ ఈ మధ్య నటనకు చాలా దూరంగా ఉన్నానన్నారు. ఒక హారర్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని తెలిపారు. అది ఇప్పుడు నటుడిగా నెరవేరబోతోందని అన్నారు.హారర్ కథా చిత్రంలో తాను నటించడం ఇదే తొలి సారి అని అన్నారు. ఇందులో తన గెటప్ చాలా కొత్తగా ఉంటుందన్నారు. ప్రభుదేవా సరసన తమన్న నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయనే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడం విశేషం.ఈ చిత్రం ప్రస్తుతం పూనేలో చిత్రీకరణ జరుపుకుంటోంది.      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement