రెండు గంటల ప్రేమ | 2 Hours Love Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

రెండు గంటల ప్రేమ

Jul 21 2019 5:46 AM | Updated on Jul 21 2019 5:46 AM

2 Hours Love Movie Trailer Launch - Sakshi

శ్రీ పవార్‌, కృతీ గార్గ్‌

శ్రీ పవార్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘2 అవర్స్‌ లవ్‌’. కృతీ గార్గ్‌ హీరోయిన్‌. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘2 అవర్స్‌ లవ్‌’ అంటే రెండు గంటల పాటు ప్రేక్షకులను ప్రేమలోనే ఉంచే సినిమా అనుకుంటున్నాను. శ్రీ పవార్‌ బాగా చేశాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది’’ అన్నారు. హీరో, దర్శకుడు శ్రీ పవార్‌ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ముఖ్యంగా దర్శకత్వం గురించి ఆలోచించేవాడిని. నన్ను దర్శకత్వం వైపు ఇన్‌స్పైర్‌ చేసిన వ్యక్తి సుకుమార్‌గారు. కాబట్టి మా చిత్రాన్ని ఆయనకు డెడికేట్‌ చేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అఖిల నా స్నేహితురాలు. కథ నచ్చడంతో సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌ అయినా కూడా నాకు సపోర్ట్‌ చేసింది. ఆమె భర్త ఎంతో సపోర్ట్‌ చేశారు. వారిద్దరికీ, మా అక్క, బావగారికి థాంక్స్‌’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా తొలి ప్రయత్నం ఇది. కష్టపడి చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు అఖిల గంజి.

Advertisement
 
Advertisement
Advertisement