‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ క్రేజ్‌.. అడ్వాన్స్‌ బుకింగ్‌లో రికార్డ్‌

1000 Tickets of Lakshmis NTR Sold With in 10 Mins of Booking of One Theatre - Sakshi

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కీలక సంఘటనలకు సంబంధించిన అసలు నిజాలను ఈ సినిమాతో బయటపెడతానని వర్మ చెప్పటం, టీడీపీ నాయకులు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి మరింతగా పెరిగింది. ఆ క్రేజ్‌ టికెట్ల అమ్మకాల్లోనూ కనిపిస్తుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

బుకింగ్స్‌ ప్రారంభించిన 10 నిమిషాల్లో కేవలం ఒక్క థియేటర్‌లోనే 1000 టికెట్లు అమ్ముడైనట్టుగా వెల్లడించాడు వర్మ. ‘ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. జై బాలయ్య’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. హైదరాబాద్‌లోని ఏయంబీ సినిమాలో బుకింగ్స్‌ కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను కూడా జోడించాడు వర్మ. టికెట్స్‌ కొన్నవారందరూ అసలైన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అన్నారు వర్మ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top