స్కూల్‌కు వెళ్లనంటే.. తండ్రి ఏం చేశాడో తెలుసా? | Viral Video Father Tied Her Daughter Onto Bike | Sakshi
Sakshi News home page

Apr 26 2018 7:41 PM | Updated on Oct 22 2018 6:10 PM

Viral Video Father Tied Her Daughter Onto Bike - Sakshi

చిన్నతనంలో స్కూల్‌ అంటే అందరికీ భయమే. స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని, స్నేహితులతో ఆడుకోవాలని ఉంటుంది. కానీ చిన్నారులు స్కూల్‌కు వెళ్లనంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా? బుజ్జగిస్తూ ఐస్‌క్రీం, చాక్లెట్స్‌ కొనిస్తూ స్కూల్‌కు వెళ్లేలా చేస్తారు. అప్పటికీ స్కూల్‌కు వెళ్లేందుకు మారాం చేస్తే నయానో, భయానో వెళ్లేలా నచ్చచెబుతారు. అప్పటికీ మొండికేస్తే  తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులు.....ఒకటి అంటించి అయినా... ఆ చిన్నారిని స్కూలుకు పంపిస్తారు.

అయితే  చైనాలోని ఒక తండ్రి మాత్రం తమ పాప స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తే విచిత్రమైన పని చేశాడు. ద్విచక్రవాహనం వెనక సీటుకు లగేజ్‌ను కట్టినట్టు తాడుతో కట్టి స్కూల్‌కు తీసుకెళ్లాడు. తాడుతో కట్టిన ఆ పాప కాళ్లు వెనక చక్రాని​కి దగ్గరగా వేలాడుతూ ఉన్న ఆ వీడియో ప‍్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు అతన్ని పట్టుకుని మళ్లీ ఇలా చేయకూడదని హెచ్చరించి వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement