
మన్మోహన్‌కు అమెరికా కోర్టు సమన్లు
పంజాబ్‌లో 1990లలో అల్లర్ల అణచివేత సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అమెరికాలోని ఓ కోర్టు సమన్లు జారీచేసింది.
వాషింగ్టన్: పంజాబ్‌లో 1990లలో అల్లర్ల అణచివేత సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుందన్న ఆరోపణల నేపథ్యంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అమెరికాలోని ఓ కోర్టు సమన్లు జారీచేసింది. నాలుగు రోజుల పర్యటన కోసం మన్మోహన్ సింగ్ గురువారం అమెరికాకు చేరుకున్నందున ఆయనకు సమన్లు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ సిఖ్‌ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) సంస్థ కోర్టు లో అర్జెంట్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేయనుంది. మన్మోహన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది, వైట్‌హౌజ్ సిబ్బంది ద్వారా ఆయనకు సమన్లు అందేలా చూడాలని కోరనుంది. అయితే న్యాయపరమైన ఇబ్బందులున్నందున ఎస్‌ఎఫ్‌జే యత్నం ఫలించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా కోర్టుల నిబంధనల ప్రకా రం.. 350 డాలర్లు చెల్లించి ఫిర్యాదు చేస్తే ఆటోమేటిక్‌గా సమన్లు జారీ అవుతుంటాయని న్యూయార్క్‌కు చెం దిన అటార్నీ రవి బాత్రా చెప్పారు.